ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో నేడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. బాలాలయం మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. కరోనా కారణంగా కేవలం ఆలయ అధికారులు, అర్చకుల నడుమే ఈ లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఆలయంలో భక్తల రద్దీ చాలా తక్కువగా ఉంది.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం