ETV Bharat / state

మోదీ, రాజగోపాల్‌రెడ్డి అహంతోనే ఉపఎన్నిక వచ్చింది: కేటీఆర్‌

KTR Fires On Central Government: కేంద్రంపై మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చాక ఒక్క మంచి పనిచేసిందా అని కేటీఆర్​ నిలదీశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడంతో సరకులు ధరలు ఆకాశాన్ని తాకాయని ఆరోపించారు. సామాన్యుడి నడ్డి విరిచి కార్పొరేట్‌ అధిపతులకు కట్టబెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

KTR Fires On Central Government
KTR Fires On Central Government
author img

By

Published : Nov 1, 2022, 1:46 PM IST

Updated : Nov 1, 2022, 4:32 PM IST

KTR Fires On Central Government: ఎమ్మెల్యే అమ్ముడు పోతే మునుగోడులో ఉపఎన్నిక వచ్చిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రాజగోపాల్‌ రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారని విమర్శించారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. మోదీ, రాజగోపాల్‌రెడ్డి అహంతో ఉపఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. మునుగోడుకు రాజగోపాల్‌ రెడ్డి చేసిందేమీ లేదని ఆక్షేపించారు. భాజపా అధికారంలోకి వచ్చాక సిలిండర్‌ ధర 3 రెట్లు పెరిగిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చాక ఒక్క మంచి పనిచేసిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదలకు మంచి జరిగిందా అని నిలదీశారు. పెట్రో ల్‌, డీజిల్‌ ధరలు పెంచడంతో సరకులు ధరలు ఆకాశాన్ని తాకాయని ఆక్షేపించారు. సామాన్యుడి నడ్డి విరిచి కార్పొరేట్‌ అధిపతులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని కేటీఆర్‌ గుర్తు చేశారు.

మోదీ, రాజగోపాల్‌రెడ్డి అహంతోనే ఉపఎన్నిక వచ్చింది: కేటీఆర్‌

"మద్యానికో, డబ్బులకు ఆశపడి దుర్మార్గులకు ఓటేస్తే సిలిండర్ ధర నాలుగు వేల రూపాయలు అవుతుంది. అప్పుడు లబోదిబో అంటే లాభం లేదు. మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటాను. ఈ పోరాటం రాజగోపాల్​ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి మధ్య కాదు. రెండు భావజాలల మధ్య జరుగుతుంది. రాజగోపాల్‌ రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు." - కేటీఆర్, మంత్రి

అన్నం పెట్టిన వారెవరో.. సున్నం పెట్టేవారెవరో చూసి ఓటు వేయాలి: భాజపాపై మంత్రి హరీశ్​రావు అన్నం పెట్టిన వారెవరో.. సున్నం పెట్టేవారెవరో చూసి ఓటు వేయాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మునుగోడులో తెరాస అభ్యర్థి గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. మునుగోడులో మహిళల కష్టాలు తీర్చిన పార్టీ తెరాస అని గుర్తించాలని పేర్కొన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్‌ను సాదుకోవాలా? సంపుకోవాలా?.. తేల్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకుని రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్నారని ఆరోపించారు.

మునుగోడు ప్రజలను ఏనాడూ రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోలేదని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. తెరాస గెలిస్తే ప్రతి గ్రామంలో మహిళా సంఘం భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెరాస గెలిస్తే మహిళలకు వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. భాజపా ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి యువతను రోడ్డున పడేసిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేట్​ పరం చేసిందని విమర్శించారు.

వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టి రైతుల నడ్డి విరిచేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బోర్ల వద్ద మీటర్లు పెడితే రాష్ట్రానికి రూ.6 వేల కోట్లు ఇస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు, 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే రైతు బీమా ఇస్తున్నామని హరీశ్‌ రావు గుర్తు చేశారు.

అన్నం పెట్టిన వారెవరో.. సున్నం పెట్టేవారెవరో చూసి ఓటు వేయాలి

"భాజపా వాళ్ల మీటింగ్​లో ఎప్పుడు తప్పుడు మాటాలు తప్ప అభివృద్ధి గురించి చెప్పలేదు. రాజగోపాల్​ రెడ్డి నాలుగేళ్ల కాలం నుంచి ఒక్క పని చేయలేదు. కానీ ఆయన రూ.18 వేల కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. ఉచిత కరెంట్, రైతు బీమా, ఇచ్చిన కేసీఆర్​ను గుర్తించాలి. మునుగోడులో ప్రభాకర్​ రెడ్డి గెలుపు ఖాయం." -హరీశ్​ రావు, మంత్రి

ఇవీ చదవండి: 'అంతర్జాతీయ నేత రాహుల్.. కానీ తన సొంత నియోజకవర్గంలో గెలవలేదు'

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు

Last Updated : Nov 1, 2022, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.