ETV Bharat / state

అసైన్డ్‌ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం : కేటీఆర్ - కేటీఆర్ కామెంట్స్ ఆన్ కాంగ్రెస్

KTR Election Campaign in Munugode : కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారంలోకి వెళ్తుందని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన రోడ్​ షో నిర్వహించారు. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన అభ్యర్థి బీజేపీలోకి వెళ్లారని.. ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారో మునుగోడు ప్రజలకు తెలుసని చెప్పారు.

KTR Election Campaign in Yadadri Bhuvana Giri
KTR Road Show in Choutuppal
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 3:33 PM IST

KTR Election Campaign in Munugode : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గులాబీ నేతల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. సంక్షేమ పథకాలే.. ప్రధానాస్త్రంగా మలుచుకున్న బీఆర్​ఎస్(BRS)​ అభ్యర్థులు ఊరూరా.. వాడవాడనా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో మంత్రి కేటీఆర్ రోడ్‌ షో నిర్వహించారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన మంత్రి.. అన్నదాతకు భరోసా.. బీఆర్​ఎస్​యేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని మంత్రి కేటీఆర్‌(KTR) విమర్శించారు. చౌటుప్పల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 60 సంవత్సరాల పాటు మునుగోడు ప్రజలను ఇబ్బంది పెట్టింది ఎవరని ప్రశ్నించారు.

కాంగ్రెస్ 11 సార్లు అధికారంలో ఉన్నా ఏం అభివృద్ధి చేసింది : కేటీఆర్

BRS Election Campaign in Munugode : గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన అభ్యర్థి ఉపఎన్నికలో బీజేపీ(BJP)లోకి వెళ్లారని.. ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారో మునుగోడు ప్రజలకు తెలుసని కేటీఆర్ చెప్పారు. 55 ఏళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా రైతుబంధు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. 3 గంటల కరెంట్‌ చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెబుతున్నారని.. వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందో? లేదో? ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కరెంట్‌ కావాలో? కాంగ్రెస్‌ కావాలో? తేల్చుకోవాలన్నారు. మరోసారి బీఆర్ఎస్​ అధికారంలోకి వస్తే పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు. అసైన్డ్‌ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని.. మునుగోడులో 30 పడకల ఆసుపత్రి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

యాదగిరిగుట్ట గురించి యావత్ ప్రపంచం చర్చించుకునే విధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారు: కేటీఆర్

KTR Latest Comments on BJP : బీజేపీ సిద్ధాంతాలను రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ప్రధాని మోదీని రేవంత్‌ ఒక్కసారి కూడా విమర్శించలేదని చెప్పారు. కాంగ్రెస్‌(Congress) హవా అనేది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 సీట్లలో మళ్లీ బీఆర్ఎస్​ అధికారంలోకి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో మైనార్టీలకు చాలా చేశామని.. వారి మద్దతు తమకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే జాబ్‌ క్యాలెండర్‌పై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. అలాగే రైతు బంధు చెల్లింపులకు అనుమతివ్వాలని ఈసీని 2 సార్లు కోరామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పీఎం కిసాన్‌కు లేని అడ్డంకి రైతుబంధుకు ఎందుకు అని నిలదీశారు.

"ఏడాది క్రితం ఉప ఎన్నికల ఎందుకు వచ్చాయో ఆలోచన చేయండి. ఎందుకు రాజీనామా చేశారో.. మళ్లీ ఎందుకు కాంగ్రెస్‌లోకి వెళ్లాడో తెలియదు. డబ్బులు ఉన్నాయి ప్రజలను ఆగండిలో సరుకులు కొన్నట్లు కొందామని భావిస్తున్నారు. నాలుగేళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదు. 11 సార్లు కాంగ్రెస్​కి అవకాశం ఇస్తే ఏమి చేశారు. మన జీవితాలను అంధకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంటి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చాం. 55 సంవత్సరాలు కాంగ్రెస్​ అధికారంలో ఉన్న ఎందుకు రైతు బంధు ఇవ్వలేదు. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో మీరే ఆలోచన చేయాలి. ఆలోచించి ఓటు వేయండి.. ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి."- కేటీఆర్, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

అసైన్డ్‌ భూములు ఉన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం

'యాదాద్రి కంటే గొప్పగా భద్రాద్రిని అభివృద్ధి చేస్తాం'

కేసీఆర్​ను ఓడించేందుకు దండుపాళ్యం బ్యాచ్ బయల్దేరింది - కాంగ్రెస్​ కావాలా? కరెంట్​ కావాలా?: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.