యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.
వారికి ఆలయ అర్చకులు సువర్ణ పుష్పార్చన పూజలు జరిపారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందచేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: చదువుకుంటూనే సేవా కార్యక్రమాలు.. రచయితగానూ గుర్తింపు