Kondandaram comments on election commission: మునుగోడు ఎన్నిక విషయంలో ఈసీ నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. తన బృందంతో హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. రాణిగంజ్ బుద్దభవన్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ముందు అరగంటపాటు బైఠాయించి మౌనదీక్ష చేపట్టారు. అనంతరం ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌ను కలిసి మునుగోడులో జరుగుతున్న ప్రభుత్వ అక్రమాల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు.
విచ్చలవిడిగా మద్యం డబ్బు పంపిణీ చేస్తున్నా... ఎన్నికల నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారని కోదండరాం ఆరోపించారు. ఎన్నికల నియమాలను తుంగలో తొక్కుతున్నప్పటికీ కమిషన్ పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే మంత్రులకు ఇస్తున్న ఎస్కార్టును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ తన అధికారాలను ఉపయోగించుకుని కట్టడి చేయాలని కోరారు. ప్రజలు తమ ఓటు హక్కును ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోదండరాం స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: