యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి లెక్కింపు కేంద్రంలోకి రావటానికి ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
అదే సమయంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అక్కడికి చేరుకున్నారు. అధికార బలంతో కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించాడు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి సునీతకు మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు మానుకోవాలని సునీత అన్నారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చూడండి: 'పుర' ఫలితాలతో జాతీయ పార్టీల చెంప చెల్లుమన్నది: కేసీఆర్