యాదాద్రి ఆలయ స్తంభాలపై చెక్కిన బొమ్మలను తొలగిస్తే సరిపోదని, ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని భాజపా నేత వివేక్ డిమాండ్ చేశారు. ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం స్తంభాలపై వివాదాస్పద చెక్కడాలను పరిశీలించారు. కేసీఆర్ బొమ్మ, కారు గుర్తు, ప్రభుత్వ పథకాల గుర్తులు చెక్కించుకోవడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు.
ఇదీ చూడండి : కేసీఆర్ కేబినెట్లో 18కి చేరిన మంత్రుల సంఖ్య