వచ్చే రెండు మూడు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భువనగిరి బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్...ప్రాజెక్టు పూర్తయితే... కాల్వలన్నీ ఏడాదిలో 9 నుంచి పది నెలల పాటు నిండు గర్భిణీలాగా నీళ్లతో కళకళలాడుతాయన్నారు. యాదాద్రి జిల్లాలో 10 లక్షల ఎకరాలు పచ్చగా మారుతాయని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మరిన్ని రిజర్వాయర్లను తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.
ఇవీ చూడండి:ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు: కేసీఆర్