నేడు భువనగిరి సభకు హాజరుకానున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు భువనగిరి సభకు హాజరుకానున్నారు. భువనగిరి- నల్గొండ మార్గంలో రోడ్డు పక్కనే ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సమావేశంకు వచ్చే పార్టీ కార్యకర్తలు, నాయకుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో అందరికీ కనిపించేలా భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి:నేడు ఓరుగల్లులో కేసీఆర్ బహిరంగ సభ