యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో కందులు కొనుగోలు చేయడం లేదంటూ కంది రైతులు రోడ్డెక్కారు. గత వారం రోజుల క్రితం నుంచి కందుల్లో తేమ శాతం చూస్తున్నారే కానీ కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అధికారులు రైతులను పట్టించుకోవడంలేదని, వసతులు కూడా కల్పించడంలేదని చెబుతున్నారు.
ఆరబోసిన కందులను వెంటనే కొనుగోలు చేయాలని మోత్కూర్ పోతాయిగడ్డలోని పాత పెట్రోల్ బంక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు ప్రయాణికులకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. కందులు రేపు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చాక రైతులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: వాహ్ తాజ్: ప్రేమాలయం అందాలకు ట్రంప్ ఫిదా