Kala Punaravi Founder Bharat Success story : ఈ యువకుడి పేరు సాయిని భరత్. స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి. చేనేత కుటుంబంలో పుట్టిన ఇతనికి చిన్ననాటి నుంచే కులవృత్తిపై ఆసక్తి ఉండేది. చేనేత కి తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని, వస్త్రాలపై విభిన్న రకాల డిజైన్లు వేస్తూ అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేస్తున్నాడు. అందులోంచి పుట్టిందే కళాపునర్వి అంటున్నాడు ఈ యువకుడు. ఉద్యోగాన్ని వదిలి చేనేత రంగంలోకి వచ్చిన భరత్‌కి ఎంత ఓపిక ఉంటే అంత ఎదుగుతాం.. అంత మంచిగా నేయగలుగుతాం అని అర్థం చేసుకున్నాడు.
తక్కువ సమయంలోనే ఈ విషయం గ్రహించి తగ్గట్టు అడుగులు వేసి కళాపునర్వి హ్యాండ్‌లూమ్స్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. నిత్యం కొత్తదనం కోరుకోవడమే విజయరహస్యమంటున్నాడు. వృత్తిపై మమకారంతోనే ఎన్నో ప్రయోగాలు చేస్తూ అందరితో మెప్పు పొందుతున్నాడు. అనేక చిత్రాలు మగ్గంపై ఆవిష్కరించాడు. వాటి తయారీకి 30 కొయ్యల ఆసును ప్రత్యేకంగా రూపొందించాడు. అలా ఒక్కో కళా ఖండాన్ని 10 నుంచి 15 రోజులలో రూపొందించాడు. ప్రపంచ వ్యాప్తంగా తమ బ్రాండ్‌కు వినియోగదారులు ఉన్నారని చెబుతున్నాడు భరత్.
"నేను ఎంటెక్ చేశాను. ఆ తరువాత దాదాపు ఆరు సంవత్సరాలు లెక్చలర్‌గా పని చేశాను. చిన్నప్పటి నుంచి చేనేతపై ఉన్న మక్కువతోనే ఈ రంగంలోకి వచ్చాను. కొత్తగా చేయాలనే ఉద్దేశ్యంతో సొంతగా ప్రముఖుల బొమ్మలను చేనేతపై వేయడం నేర్చుకున్నాను. పంచ వ్యాప్తంగా మాకు కస్టమర్స్ ఉన్నారు. వారు ఎంచుకున్న విధంగా మేము వస్త్రాలను తయారు చేసి వారికి పంపిస్తాం". -భరత్ , కళా పునర్వి యజమాని
Bhudan Pochampally sarees : వీరు నేస్తున్న వస్త్రాలకు సంబంధించి దారాన్ని ప్రత్యేకంగా బెంగుళూరు నుంచి తెప్పిస్తున్నారు. నాణ్యత విషయంలో వెనకడుగు వేయమని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కళాపునర్వికి సాయం చేసిందంటున్నాడు, రాష్ట్రప్రభుత్వం నుంచి కాళోజీ అవార్డు తో పాటు కేంద్రం నుంచి కూడా అవార్డులు అందుకున్నాడు భరత్. మరోవైపు తన హ్యాండ్లూమ్ సంస్థ స్థాపించడం ద్వారా మొత్తంగా 70 మంది వరకు ఉపాధి కల్గించగలుగుతున్నాడు. భరత్‌కు చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్త కోణంలో చూడడం అలవాటు. ఏం చేసినా కొత్తదనం చూస్తుంటాడు.
Pochampally design sarees : అదే కళాపునర్వికి పునాదైంది అంటున్నాడు భరత్ సోదరుడు భాస్కర్. రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటే మరింత ముందుకు సాగుతామని అంటున్నాడు భాస్కర్. పురాతన విషయాలకే కాస్త ఆధునికత జోడించి అద్భుతంగా వస్త్రాల తయారీ చేపడుతున్నాడు భరత్. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చేరుకునేంతలా ఎదిగాడు. సాధారణ కుటుంబం నంచి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు ఈ యువకుడు. నచ్చిన రంగంలో ఉంటేనే శిఖరాగ్రాలను చెబుతున్నాడు భరత్.
"నేను ఇంటర్ వరకు చదువు కున్నాను. నాకు చేనేతపై ఉన్న ఆసక్తితో ఇక్కడ జాయిన్ అయ్యాను. నెల రోజులు మాకు ఉపాధి ఉంటుంది. సుమారు రూ.15వేలు వరకు ఇస్తారు. మంచిగా చూసుకుంటారు. ఆ తరువాత పని కూడా మంచిగా నేర్పిస్తారు. ఇక్కడ సుమారు 70మంది వరకు పనివారు ఉన్నారు".- ప్రసాద్, వర్కర్
ఇవీ చదవండి: