దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూలో భాగంగా యాదాద్రిలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. భక్తజనం లేక లక్ష్మీనరహింహస్వామి వారి ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు స్వీయనిర్బంధం విధించుకుని ఇళ్లకే పరిమితమైపోవడం వల్ల పట్టణంలోని రహదారులు, ప్రధాన కూడళ్లు బోసిపోతున్నాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్ : బోసిపోయిన పర్యాటక ప్రాంతాలు