జలశక్తి అభియాన్ పథకం కింద కేంద్రం నియమించిన సభ్యుల బృందం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించింది. మూడ్రోజుల పర్యటనలో భాగంగా భువనగిరి, రాజపేట్, తుర్కపల్లి మండలాల్లోని అన్నపూర్ణ ప్రకృతి వ్యవసాయ క్షేత్రం, జీరో బడ్జెట్ ఫామింగ్ చిరుధాన్యలు పంటల సాగు, నీటి యాజమాన్య పద్ధతులను పరిశీలించారు. నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు అవినాష్ మిశ్రా, కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ ఎకనామిక్ ఆఫెర్స్ మనీష్ కుమార్ జా రైతులతో ముచ్చటించారు. చిరుధాన్యల సాగులో అవలంభిస్తున్న విధానం, పంట కాలం మార్కెటింగ్ వివిధ అంశాలను తెలుసుకున్నారు. అన్నపూర్ణ వ్యవసాయ క్షేత్రం పొలం గట్ల మీద మొక్కలు నాటారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, జిల్లా హార్టీకల్చర్ అధికారి సురేష్, జిల్లా సహకార శాఖ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐలో అక్రమాలను నిగ్గుతేల్చే పనిలో అనిశా