ETV Bharat / state

చెరువులపై కన్ను.. యథేచ్ఛగా ఇసుక మాఫియా - sand mafia at tangadpally pedda cheruvu

యాదాద్రి జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. స్థానిక రాజకీయ నేతల అండదండలతో దళారులు అందినంత ఇసుక మింగేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడి ఎక్కడపడితే అక్కడ... పెద్దపెద్ద గోతులు తవ్వి ఇసుక బయటకుతీస్తుండటం వల్ల భయానక పరిస్థితి నెలకొటోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

illegal sand mafia at yadadri district
చెరువులపై కన్ను.. యథేచ్ఛగా ఇసుక మాఫియా
author img

By

Published : Jun 28, 2020, 11:57 AM IST

రాష్ట్రంలో రోజురోజుకు ఇసుకకు డిమాండ్‌ పెరగడటం వల్ల అందినకాడికి దుండుకునేందుకు అక్రమార్కులు... అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో వాగులు, నదీ తీరప్రాంతాల నుంచి ఇసుకను తీసుకురాగా.. ప్రస్తుతం చెరువులను వదిలిపెట్టడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి పెద్దచెరువుపై ఇసుక మాఫియా కన్నేసింది. 10 వేల జనాభా ఉన్న ఆ గ్రామం ఇటీవలే చౌటుప్పల్‌ పురపాలక సంఘంలో విలీనమైంది. చెరువులు, ఖాళీ స్థలాలు ఆక్రమించుకనేందుకు రాజకీయ నేతల అండదండలతో కొందరు దళారులు ఇసుక దందా సాగిస్తున్నారు. ఏడేళ్లుగా చెరువు నిండకపోవడం వల్ల పెద్ద పెద్ద తుమ్మ చెట్లు మొలిచాయి. వాటిని అవకాశంగా తీసుకొని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల తాగు, సాగునీటి కోసం రైతులు, ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.

లోతులో నుంచి ఇసుక

చెరువు సమీపంలోని గుంతలు చూసేందుకు చిన్నగా ఉన్నా లోపలకు వెళ్లి చూస్తే భయపడాల్సిందే. ఒక్కోటి 15 నుంచి 20 అడుగుల లోతులో నుంచి ఇసుకను తవ్వి బయటకు తీస్తున్నారు. గుంతల లోపల రెండు మూడు వైపులా తవ్వి ఇసుక నింపిపైకి ఇస్తుంటే మరికొందరు జల్లడ పట్టి కుప్పపోస్తారు. మరొకరు ఎవరైనా వస్తున్నారా అంటూ పర్యవేక్షిస్తున్నారు. ఆ విషయంపై ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఏదో పార్టీ నేత వచ్చినిందితులకు అండగా ఉంటున్నారు. రాజకీయనేతలు సహకరిస్తుడటం వల్ల చెరువు సంరక్షణపై స్థానికులు ఆశలు వదిలేసుకున్నారు.

స్థానిక నాయకులు

2017లో మిషన్ కాకతీయ పథకం ద్వారా తంగడపల్లి పెద్ద చెరువు పురనుద్ధరణ పనులు చేపట్టేందుకు కోటి 40 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక నాయకులు నిధులు దారి మళ్లించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక కోసం తవ్విన్న గుంతల్లో పశువులు పడి చనిపోతున్నాయని జీవాల కాపరులు వాపోతున్నారు.

ఇంత జరుగుతున్నా అధికార యంత్రాగం అటువైపు కన్నెత్తి చూసినా పాపానా పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : తెలంగాణ భూమి పుత్రుడికి ఘన నివాళి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.