ETV Bharat / state

మరణంలోనూ వీడని బంధం - చావులోనూ ఒక్కటయ్యారు

అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు వృద్ధాప్యం వరకు కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. కడదాక తోడుంటాడనుకున్న భర్త..జీవిత చరమాంకంలో తన కళ్ల ముందే కన్నుమూయడం ఆ ఇల్లాలి గుండె తట్టుకోలేక పోయింది. భర్త మరణించిన కాసేపటికే భార్య కన్నుమూసింది.

husband and wife dead on same day at pochampally in yadadri bhuvanagiri district
మరణంలోనూ వీడని బంధం
author img

By

Published : Dec 5, 2019, 10:16 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో నల్లగంటి లక్ష్మీనారాయణ, సుక్కమ్మ దంపతులు నివసిస్తుండేవారు. వారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.
కొంతకాలం క్రితం లక్ష్మీనారాయణ అనారోగ్యానికి గురయ్యాడు. ఈనెల 4న అతను మరణించాడు. భర్త మరణం తట్టుకోలేని ఆ ఇల్లాలి గుండె కాసేపటికే ఆగిపోయింది.
ఒకే రోజు భార్యాభర్తలిద్దరూ చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Intro:tg_nlg_212_04_dampatulu_mruthi_av_TS10117
పెళ్లి నాడు వేదమంత్రోచ్చారణల నడుమ ఒక్కటైన వారు వృద్ధాప్యం వరకు ఒకరికొకరు తోడై నిలిచారు. కష్ట సుఖాలు కలిసే అనుభవించారు. పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్ది ముదిమి వయస్సులో మనవళ్లు, మానవరాళ్లతో ఆడిపాడారు. ఎనమిది పదుల వయస్సులో భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో... ఆ ఇల్లాలు అతనికి సపర్యలు చేసింది. తనతో జీవితాంతం కలిసి ఉంటాడనుకున్న భర్త చనిపోవటంతో కన్నీరు మున్నీరుగా విలపించింది. భర్త మరణం తట్టుకోలేక తాను కన్నుమూసిన ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోచంపల్లి పురపాలికకు కేంద్రానికి చెందిన నల్లగంటి లక్ష్మీనారాయణ, సుక్కమ్మలకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మరణించిన కొద్దిసేపటికే భార్య సుక్కమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ఒకేరోజు భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.