యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్రం(Yadadri temple latest news) భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు తరలివచ్చారు. కొండపైన ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. ధర్మదర్శనం, వీఐపీ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది.
భక్తుల రద్దీ కారణంగా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఆలయంలో ఉదయం జరిగిన స్వామి వారి నిత్యాభిషేకంలో ఆలయ ఈవో పాల్గొన్నారు. ప్రధానాలయం విమాన గోపురానికి బంగారు తాపడం కోసం భక్తుల నుంచి విరాళాల సేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. భక్తులు విరాళాలు ఇవ్వడానికి క్యూఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆలయంలో హుండీ, నేరుగా ఆలయ కార్యాలయానికి వచ్చి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామని ఈవో తెలిపారు.
యాదాద్రి పునర్నిర్మాణంలో పాలుపంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలి. స్వామివారి విమాన గోపురాన్ని స్వర్ణమయం చేయడానికి మీ వంతుగా విరాళాలు సమర్పించి... అందరూ కూడా లక్ష్మినరసింహ స్వామి ఆశీర్వాదాన్ని పొందాలని కోరతున్నాం.
-గీతారెడ్డి, ఆలయ ఈవో
యాదాద్రి ఆలయం పునఃప్రారంభం కోసం మహూర్తం ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ (Mahakumbha Samprokshana) ఉటుందని సీఎం కేసీఆర్.. యాదాద్రి పర్యటనలో తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని సీఎం వివరించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం యాదాద్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సమైక్య పాలకుల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు.
‘‘సమైక్య పాలనలో ఆధ్యాత్మిక అంశంలో కూడా నిరాదరణ జరిగింది. గతంలో పుష్కరాలు కూడా తెలంగాణలో నిర్వహించలేదు. ఉద్యమ సమయంలో గోదావరి పుష్కర శోభ ప్రపంచానికి తెలియజేశాం. ఆధ్యాత్మిక సంపద ఉన్న ప్రాంతం తెలంగాణ. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి గతంలో ప్రాచుర్యం కల్పించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాచుర్యంలోకి తెచ్చాం. యాదాద్రి అభివృద్ధికి నాలుగైదేళ్ల క్రితం బీజం వేశాం. మహోత్కష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి. యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టాం. చినజీయర్ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు జరిగాయి. చినజీయర్‌స్వామి లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆయన సూచనలతో సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చలు జరిపి పునర్నిర్మాణం చేశాం. అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటీ (Temple City) నిర్మాణం జరిగింది’’ అని సీఎం వివరించారు.
ఇవీ చదవండి: