ETV Bharat / state

YADADRI TEMPLE: యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ - నల్గొండ తాజా వార్తలు

YADADRI TEMPLE: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో యాత్రికులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

yadadri temple
యాదాద్రి దేవాలయం
author img

By

Published : Mar 20, 2022, 3:24 PM IST

Updated : Mar 20, 2022, 3:42 PM IST

YADADRI TEMPLE: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తులు దైవ దర్శనం కోసం బారులు తీరారు. వేకువజామున సుప్రభాతంతో మొదలైన నిత్య కైంకర్యాలు,అభిషేకాలు అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాలాలయంలో ధర్మ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అరగంట సమయం పడుతోంది.

Crowd of devotees in the temple
బాలాలయంలో భక్తుల రద్దీ

పాత గుట్ట ఆలయంలో శ్రీసుదర్శన నారసింహహోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం, సహస్రనమార్చనలు నిర్వహించారు. కొండ కింద శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు కొనసాగాయి. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు.

Devotees in culines
క్యూలైన్లలో భక్తులు

మహాసంప్రోక్షణ నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాదాద్రి .. స్వయంభువుల దర్శనానికి భక్తులకు సమయం ఆసన్నం అవుతోంది. ఈనెల 21న మహాసంప్రోక్షణతో ఈ చారిత్రక ఘట్టానికి యాడా అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా సోమవారం ప్రారంభం కానున్న అంకురార్పణకు పంచనారసింహుల సన్నిధి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. బాలాలయంలో వారంపాటు జరగనున్న పంచకుండాత్మక మహాయాగం కోసం కుండాలు ఏర్పటయ్యాయి. నలువైపులా ప్రవేశ ద్వారాలను శనివారం ఏర్పాటు చేశారు. పంచనారసింహుల గర్భాలయంలో నీటితో శుద్ధి పర్వాలు నిర్వహించారు.

ఇదీ చదవండి: Yadadri temple: నవ వైకుంఠం యాదాద్రి వైభవం.. అడుగడుగునా అద్భుతం.!

Last Updated : Mar 20, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.