ETV Bharat / state

Vaccine problems: టీకా కష్టాలు.. కేంద్రాల వద్ద భారీ రద్దీ - టీకా పంపిణీ కేంద్రాలు

రాష్ట్రంలో టీకాల కొరత వేధిస్తోంది. పలు జిల్లాల్లో వ్యాక్సిన్​ కేంద్రాల ముందు జనాలు బారులు తీరుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు కేవలం వంద మందికే టీకా పంపిణీ జరుగుతోంది. దీంతో అందరూ ఒక్కసారిగా రావడంతో భౌతిక దూరం విస్మరించి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. యాదాద్రి భువనగిరి, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లోని వ్యాక్సిన్​ కేంద్రాల ప్రజలు అవస్థలు పడ్డారు.

రాష్ట్రంలో టీకాల కొరత
huge crowd at covid vaccine centers
author img

By

Published : Jul 19, 2021, 6:41 PM IST

ప్రజల్లో అవగాహనా లోపం, అధికారుల నిర్లక్ష్యం కలిసి వ్యాక్సిన కేంద్రాల వద్ద టీకా కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజుకు కేవలం వందమందికే టీకాలు ఇవ్వడం వల్ల ప్రజలు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు.

టోకెన్లు ఇచ్చిన వారికే వ్యాక్సిన్

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్​ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు వ్యాక్సిన్ కోసం ప్రజలు ఒక్కసారిగా గుమిగూడారు. అక్కడ ప్రతి రోజు 100 మందికే మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్​ కేంద్రం వద్ద భౌతికదూరం విస్మరించి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 600 మంది టీకా కోసం రాగా.. ముందుగా టోకెన్లు ఇచ్చినవారికి మాత్రమే ఆసుపత్రి సిబ్బంది వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో టీకా అందరికీ ఇవ్వాలని ప్రజలు వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

Vaccine problems
వ్యాక్సిన్​ కేంద్రాల ముందు జనాలు బారులు

భౌతికదూరం విస్మరిస్తున్నారు

జిల్లాలోని వలిగొండ, వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి. ప్రజలు ఒక్కసారిగా భారీ సంఖ్యలో కేంద్రం వద్దకు రాగా.. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ పంపిణీ కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం ముందుగా టోకెన్లు ఇచ్చిన 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని ఆందోళన చేశారు. అధిక సంఖ్యలో వ్యాక్సిన్ కోసం జనాలు రావటంతో కొవిడ్​ నిబంధనలు అమలు కావడం లేదు. ప్రజలు భౌతిక దూరం మరచిపోయి గుంపులుగా చేరారు. ఆస్పత్రి సిబ్బంది వీరిని నియంత్రించలేక చేతులెత్తేశారు.

Vaccine problems
కేంద్రాల వద్ద భారీ రద్దీ

ప్రజల ఆందోళన

జగిత్యాల పట్టణంలో రెండో డోసు తీసుకునేందుకు భారీగా తరలి రావటంతో పంపిణీ కేంద్ర వద్ద రద్దీ పెరిగింది. అయితే జిల్లాలో రెండో డోసు వేసేందుకు కేవలం ఒక్క కేంద్రమే ఏర్పాటు చేయడంతో ప్రజలకు అవస్థలు తప్పలేదు. పురాతన పాఠశాలలోని వ్యాక్సిన్​ కేంద్రానికి ఉదయం నుంచే ప్రజలు క్యూలో నిల్చున్నారు. గంటల కొద్దీ లైన్లో వేచి ఉన్నా కూడా టీకా అందలేదని ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vaccine problems
కేంద్రాల వద్ద భారీ రద్దీ

ఖమ్మంలోనూ రద్దీ

ఖమ్మంలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. నగరంలోని ఐదు కేంద్రాల్లో కొవిషీల్డ్, ఒక్క కేంద్రంలో కొవాగ్జిన్ టీకాలు ఇస్తున్నారు. వ్యాక్సిన్​ కోసం ప్రజలు ఉదయం నుంచి కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఒక్కో కేంద్రంలో 100 నుంచి 200 మందికే టీకాలు ఇస్తుండడంతో ప్రజలు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:

HARISH RAO: ప్రతి ఒక్కరికి టీకాలు వేయించే బాధ్యత మీదే: హరీశ్​ రావు

Vaccination: లక్ష్యానికి చేరువలో.. 6నెలల వ్యవధిలో కోటి 16 లక్షల టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.