ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో జోరుగా యాసంగి.. అన్నదాతల్లో ఆనందం. - అన్నదాతల్లో ఆనందం.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖరీఫ్​లో కురిసిన భారీ వర్షాలు అన్నదాతల్లో ఆశలు నింపాయి. అప్పటి వరకు చుక్క నీరు లేక వెలవెలబోయిన చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. గోదావరి జలాలు చెరువులోకి చేరుతుండటం వల్ల యాసంగి సాగు జోరుగా సాగుతోంది. భూగర్భ జలాలు పెరిగి బోర్లలోకి జల నిధి చేరింది.

జోరుగా యాసంగి సాగు
జోరుగా యాసంగి సాగు
author img

By

Published : Mar 13, 2020, 11:55 AM IST

జోరుగా యాసంగి సాగు

భూగర్భ జలాలు పెరగడం వల్ల యాదాద్రి జిల్లాలోని గుండాలలో గత రబీకి సంబంధించి 2,050 ఎకరాల్లో వరి సాగైంది. ఖరీఫ్ సీజన్​​లో 3,050 ఎకరాలకు సాగు చేశారు. ప్రస్తుత రబీలో అది 4,605 ఎకరాలకు పెరిగింది. రైతులు పెద్ద ఎత్తున వరి సాగు మెుదలెట్టి నాట్లు కూడా పూర్తి చేశారు. జిల్లాలోని 17 మండలాల్లో వరి సాగు విస్తీర్ణమే గణనీయంగా పెరిగింది.

వర్షాలు సమృద్ధిగా కురవడం, గోదావరి జలాలు వస్తుండటం వల్ల ఖరీఫ్​తో పోల్చుకుంటే మూడు మీటర్ల మేర భూగర్భ జలం ఉబికి వచ్చింది. దీనికి తోడు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా అవుతోంది. మూసీ ఆయకట్టులోని భూదాన్ పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్, రామన్నపేట, భువనగిరి మండలాల్లో ఏటా వరి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా ఒకే విధంగా సాగవుతోంది. ఈసారి జనగామ జిల్లా నవాబ్ పేట రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలతో గుండాల మండలంలోని చెరువులు నింపారు. తపస్ పల్లి రిజర్వాయర్ కాలువల ద్వారా రాజాపేట, ఆలేరు మండలాల్లోని కొన్ని చెరువులు నింపారు. సెప్టెంబర్, అక్టోబర్​లో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు అమాంతం పెరిగాయి. రబీలో 36,939 హెక్టార్లలో వరి సాగు అవుతోందని వ్యవసాయ అధికారుల అంచనా. కానీ అది 54,800 హెక్టార్లకు పెరిగింది.

జిల్లాలో రబీ సాగు వివరాలు హెక్టార్లలో.

పంట సాధారణ వాస్తవ సాగు
వరి 36.939 54.800
పప్పు దినుసులు 513 138
నూనెగింజలు 152 32
మొక్కజొన్న 78 06
ఇతర 'బీ' పంటలు 1.317 30

వర్షాకాలంలో జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. బీడు భూములు సాగులోకి రావడం వల్ల రైతులు ఎక్కువగా వరి నాట్లు వేశారు. ఫలితంగా ఎక్కడ చూసినా పచ్చని పొలాలు దర్శనమిస్తున్నాయి. పీఏసీఎస్ నూతన పాలకవర్గం... ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అధికారులతో చర్చించి దానికి అనుగుణంగా మండలాల్లో ఐదు నుంచి ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రైతులు పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు కోరారు.

ఇవీ చూడండి : కిడ్నీ బాధితుల్లో అవగాహన పెరగాలి: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.