యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ సమయంలో మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన హోంగార్డులు.. వాటిని వదిలేసి ఎంచక్కా కునుకు తీశారు. ఈ ఫొటోలు బయటికి రావడంతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
హోంగార్డ్స్ విధులను మరచి నిద్రపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే వారు విధులను ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో అర్థమవుతోందని పలువురు పెదవి విరుస్తున్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై హోంగార్డుల నుంచి వివరణ అడుగుతామని, సమాధానం సరిగా లేకుంటే చర్యలు తీసుకుంటామని యాదగిరి గుట్ట ఆలయ ఎస్పీఎఫ్ జమిందార్ తెలిపారు.