యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూర్, మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షానికి పట్టణంలోని పలు కాలనీలోకి భారీగా నీరు వచ్చి చేరింది. రోడ్లపైకి నీరు చేరటం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటం వల్ల మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
యాదగిరిగుట్టలోని బీసీ కాలనిలో ఒక వ్యక్తి ఇంటి పై కప్పు రేకులు లేచిపోయాయి. మోటకొండూరు మండలంలోని చాడ గ్రామానికి చెందిన అబ్రహం రైతుకు చెందిన రెండు పాడి గేదెలు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి. వాటి విలువ సుమారు 90 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని కోరారు.