Fog at Yadadri Temple : రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను తలపిస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల దట్టమైన పొగమంచు అలుముకుంది. యాదాద్రి పరిసర ప్రాంతాలను మంచుదుప్పటి కప్పేసింది. కొండపైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, బాలాలయం, ఆలయ పరిసరాలను ఉదయం నుంచి పొగమంచు కమ్మేసింది.
Fog at Yadadri Temple Surroundings : యాదగిరిగుట్ట, ప్రధాన రహదారి, ఘాట్ రోడ్డు ప్రాంతాలు, దారుల్లో వెళ్లే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎదురుగా వచ్చే మనుషులు, వాహనాలు కనిపించకపోవటంతో.. లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
భువనగిరిలో సుందర దృశ్యాలు
Fog at Yadadri : భువనగిరి పట్టణంలో ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా మంచు దుప్పటి అలాగే ఉంది. రోడ్డు సరిగా కనిపించక హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల హెడ్ లైట్ల వెలుతురుతో ప్రయాణిస్తున్నారు. భువనగిరి బస్టాండ్, చెరువు, ప్రధాన రహదారులతో పాటు పరిసర గ్రామాల పరిధిలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పొగమంచు కురుస్తుండటంతో పట్టణంలో సుందర దృశ్యాలు అవిష్కృతమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు
Fog at hyderabad Outskirts : హైదరాబాద్ నగర శివారుల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్, బీఎన్ రెడ్డినగర్ రోడ్లపై మంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచు కారణంగా చాలామంది మార్నింగ్ వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై పొగమంచు తీవ్రంగా ఉండడంతో వాహనదారులు లైట్స్ వేసుకొని ప్రయాణిస్తున్నారు.
ఇదీ చదవండి: Firing between crpf jawans mulugu : ములుగు జిల్లాలో జవాన్ల మధ్య కాల్పులు.. ఒకరు మృతి