యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారిని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. బాలలయంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ప్రత్యేక ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మంత్రి వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఆలయ ఈఓ గీత, ప్రధానార్చకులు లక్ష్మి నరసింహ చార్యులు, మున్సిపల్ ఛైర్పర్సన్ సుధ, జడ్పీటీసీ అనురాధ, తదితరులు ఉన్నారు. అంతకు ముందు యాదాద్రి కొండపైన హరిత టూరిజంలో మంత్రికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్... మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

ఇదీ చూడండి: నారసింహుని చెంతకు పోటెత్తిన భక్తులు