Govt Resettled People in Rehabilitation in Yadadri : జలాశయాలు నిర్మించడానికి అక్కడున్న ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పిస్తారు. ఇక్కడ వారికి ఉన్న మౌలిక సదుపాయాలన్ని కల్పిస్తు ఇతర ప్రాంతాలకి వారిని తరలిస్తారు. సహజంగా ఇలా పునరావాసం కల్పించాక వారు అక్కడ పరిస్థితులు.. ఆ ప్రాంతాన్ని అలవాటు చేసుకోవడానికి సమయమే పడుతుంది. కానీ వీరికి మాత్రం ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడు అలవాటు అయిన ప్రాంతాన్ని కూడా ప్రస్తుతం నిర్మిస్తున్న నృసింహ సాగర్ జలాశయానికి ముంపు ప్రాంతంగా ఉంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది. ప్రస్తుతం బస్వాపూర్ ప్రజలు ఇదే స్థితిలో ఉన్నారు.
మీ త్యాగం వెలకట్టలేనిది: జలాశయ నిర్మాణం, భావితరాల అవసరాల కోసం మీరు చేసిన ఈ త్యాగం డబ్బుతో వెలకట్టలేమని నిర్వాసితులను ఉద్దేశిస్తూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నృసింహ సాగర్ (బస్వాపుర్) జలాశయం నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన లప్ప నాయక్ తండా నిర్వాసితుల పునరావాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంట్లో భాగంగా శనివారం దాతర్ పల్లి రెవెన్యూ పరిధిలోని 294 సర్వే నెంబర్లో రూ.26.50 కోట్లతో అభివృద్ధి చేయనున్న లేఅవుట్‌కు శంకుస్థాపన చేశారు.
నల్లమలలో ఆ గ్రామస్థుల అరణ్యరోదన
మూడు నెలల్లోనే ఇంటి స్థలాలు: 30.11 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ లేఔట్లో ఒక్కొకరికి 200 గజాల చొప్పున మొత్తం 327 మంది నిర్వాసితులకు ఇంటి స్థలాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ సునీత మాట్లాడారు. మూడు నెలల కాలంలోనే ఇళ్ల స్థలాలను, ఆరు నెలల్లోనే విద్యుత్ కనెక్షన్ , నీటి సరఫరా, పారిశుద్ధ్య, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను పూర్తి చేస్తామని పునరావాస నిర్వాసితులకు హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ భవనం, పార్క్, కమ్యూనిటీ హాల్, పాఠశాల, అంగన్ వాడి మొదలగు వాటి నిర్మాణాల కోసం సుశాలమైన స్థలాలను కేటాయించామని తెలిపారు. వాటి నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. రాబోయే తరాల కోసం మీ త్యాగం డబ్బుతో వెలకట్టలేమన్నారు.
ఇన్నేళ్లుగా ఉంటున్న నివాసాలను వదిలి వెళ్లడానికి స్థానికులు బాధగా ఉందంటూ అవేదన వ్యక్తం చేశారు. వారి వేదను చూసిన అక్కడున్నవారిని సైతం కంటతడి పెట్టించాయి. గతంలో కూడా మా పూర్వీకులు నాగార్జునసాగర్ జలాశయం ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని... ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ప్రాంతం ముంపుకి గురవుతుందని ఇక్కడి నుంచి వెళ్లడానికి మనసు ఒప్పుకోవడం లేదని స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
Telangana Flood 2023 CM review : "వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయండి"