జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రేగుంటలో చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పరామర్శించారు. ఇటీవలే సుమన్ తండ్రి కన్నుమూశారు. గురువారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రేగుంట గ్రామానికి చేరుకుని సుమన్ తండ్రి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ దివంగత బాల్క సురేష్ చిత్ర పటానికి ఆమె నివాళులు అర్పించారు.
అనంతరం సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిబద్ధత గల ఉద్యమకారుడిని కోల్పోవడం బాధాకరమని విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: Rythubandhu: రైతుబంధు కోసం మరో రూ.3 వేల కోట్ల రుణం తీసుకోనున్న ప్రభుత్వం