యాదాద్రి క్షేత్ర పనుల పరిశీలనకు డిసెంబర్ 17న యాదాద్రికి వచ్చిన కేసీఆర్, ఆలయ విమానాన్ని బంగారు మయం చేయాలన్నా ఆలోచనను యాడ నిర్వాహకులతో పంచుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో యాడ అధికారులు ఎంత బంగారం అవసరం అవుతుందన్న అంచనాలు మొదలుపెట్టినట్లు సమాచారం. గర్భాలయంలోని స్వయంభు తొడుగులకు బంగారంతో మెరుగులు దిద్దే పనులు చేపట్టాలని యాడ నిర్ణయించింది.
గర్భాలయంలోని, మూలవర్యులకు ఇప్పటికే స్వర్ణ కవచాలను వినియోగిస్తున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా ఆ కవచాలకు మెరుగులు దిద్ది ధగధగలాడేట్లు తీర్చిదిద్దనున్నారు. నలువైపులా ఆరు రాజ గోపురాలపై, కలశాలకు బంగారం తొడుగుల తయారీ పనులు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి : పంటను కొనుగోలు చేయాలని రోడ్డుపై ఎమ్మెల్యే నిరసన