ETV Bharat / state

అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో నయీం అనుచరుల అరెస్టు - అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో నయీం అనుచరుల అరెస్టు

ఓ వ్యక్తి ఇంటి స్థలం అక్రమ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లో సాక్షి సంతకం పెట్టినందుకు... నయీం అనుచరులు ఇద్దరిని భువనగిరి పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో నయీం అనుచరుల అరెస్టు
author img

By

Published : Oct 22, 2019, 6:38 AM IST

గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులైన సామల జగదీష్‌, అదునూరి కృష్ణను భువనగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణంలోని కిసాన్‌నగర్‌లో... ఏ సుబ్రమణ్యం కృష్ణకు చెందిన 268 గజాల ఇంటి స్థలాన్ని ఆక్రమించి 2001లో నయీం సోదరి సలీమా బేగం పేరుపై అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లో నిందితులు సాక్షి సంతకం చేసినట్లు వెల్లడించారు. స్థలం యజమాని 2017లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. సుబ్రమణ్యం కృష్ణా ప్రస్తుతం డల్లాస్‌లో నివసిస్తున్నారు.

అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో నయీం అనుచరుల అరెస్టు

ఇదీ చూడండి: రహదారి సమస్యలకు చెక్‌... బల్దియా సరికొత్త ఆలోచన

TG_NLG_67_21_NAYEEMANUCHARULA_ARREST_AV_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - యాదాద్రి భువనగిరి యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్ లోని ఓ ఇంటి స్థలాన్ని ఆక్రమించుకున్న కేసులో గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులు సామల జగదీష్, అదునూరి కృష్ణ లను భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.భువనగిరి పట్టణంలోని కిసాన్ నగర్ లో ఎ. సుబ్రమణ్యం కృష్ణ కు చెందిన 268 గజాల ఇంటి స్థలాన్ని 2001లో బెదిరించి నయీమ్ సోదరి సలీమా బేగం పేరుపై అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈకేసులో డాక్యుమెంట్ లో సాక్షి సంతకం చేసిన సామల జగదీష్, అదునూరి కృష్ణ ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి 2017 లో స్థల యజమాని ఎ. సుబ్రమణ్యం కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థల యజమాని సుబ్రమణ్యం కృష్ణ ప్రస్తుతం అమెరికా లోని డల్లాస్ లో నివసిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.