యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఫారెస్ట్ బ్లాక్‌లను రాష్ట్ర అటవీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి క్షేత్రస్థాయిలో సందర్శించారు. బీబీనగర్ మండలంలోని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్, రాయగిరిలోని నరసింహ అరణ్యం ఫారెస్ట్ బ్లాక్, ఆంజనేయ అరణ్యం అర్బన్ బ్లాక్‌లను పరిశీలించారు.
జిల్లా అటవీ శాఖకి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, జిల్లా అటవీ శాఖ అధికారి డి.వి. రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు.
ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్