ETV Bharat / state

హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ: ఇంద్రకరణ్​ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితోద్యమంతో తెలంగాణ ఆకుపచ్చగా మారుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి, వడాయిగూడంలో అటవీ శాఖ అభివృద్ధి చేసిన ఆంజనేయ అరణ్యం, నరసింహ అరణ్యం పార్కులను ప్రారంభించారు.

forest minister indrakaran reddy inaugurated parks in yadadri bhuvanagiri distritct
హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ: ఇంద్రకరణ్​ రెడ్డి
author img

By

Published : Jul 3, 2020, 3:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి, వడాయిగూడంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి పర్యటించారు. అటవీ శాఖ అభివృద్ధి చేసిన ఆంజనేయ అరణ్యం, నరసింహ అరణ్యం పార్కులను ప్రారంభించారు. రాయగిరి నుంచి యాదాద్రి వెళ్లే రహదారిలో ఉండే అరణ్యాలు భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయని చెప్పారు.

యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని.. వచ్చే రోజుల్లో ఈ ప్రాంతమంతా పచ్చని అడవులతో, పార్కులతో భక్తులకు ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయతను అందిస్తుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఆలయ ఈవో గీత రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఈనాడు, ఈటీవీ భారత్ కథనానికి స్పందన... నగరానికి వచ్చేస్తున్న బామ్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.