ETV Bharat / state

అక్రమంగా చెరువు మట్టి తరలింపు.. గ్రామస్థుల ఆగ్రహం - అక్రమంగా చెరువు మట్టి తరలింపు

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పులపల్లిలోని గొర్రెకుంట చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలించడపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

fond soil illegal shifting to real estate venture in velpulaplli
అక్రమంగా చెరువు మట్టి తరలింపు.. గ్రామస్థుల ఆగ్రహం
author img

By

Published : Dec 29, 2020, 10:51 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామ శివారులోని గొర్రెకుంట చెరువులో నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు వెంచర్​లో పోస్తున్నారని తెలిపారు. ఈ తతంగమంతా రెండు రోజులుగా జరుగుతున్నా.. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేసీబీలు, లారీలు, టిప్పర్​లతో పెద్ద ఎత్తున్న మట్టి తరలించడాన్ని చూసి అందరూ ఆశ్చర్చపోతున్నారు. ఎవరైనా అడిగితే చేపల చెరువు కోసం తవ్వుతున్నామని సమాధానమిస్తున్నారు. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా... సర్పంచ్​కు చెప్పి పనులు ఆపించినట్టు తెలిపారు. అనమతులు లేకుండా పనులు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో యూకే వైరస్​ కలకలం... ఆరోగ్యశాఖ అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.