యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో అవయవ దాత నర్సిరెడ్డి కుటుంబానికి సాయం చేసేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. ఇంటిపెద్దను కోల్పోతున్న బాధను దిగమింగుకుని.. ఇతరుల జీవితాలను నిలబెట్టడానికి వారు చేసిన గొప్ప పనిని అంతా మెచ్చుకుంటున్నారు. అవయవదానానికి అంగీకరించిన కుటుంబం.. అందరికీ ఆదర్శ ప్రాయమంటున్నారు. గత నెల 30న నర్సిరెడ్డి దురదృష్టవశాత్తు బ్రెయిన్‌డెడ్ అయి చనిపోయారు.
నర్సిరెడ్డి అకాల మరణం బాధాకరమంటూ.. తమ వంతు బాధ్యతగా స్థానిక శ్రీ లక్ష్మీసాయి బోర్‌వెల్స్ యజమాని కౌకుంట్ల మంజుల మధుసుదన్‌రెడ్డి రూ. 2లక్షల చెక్కును బాధితులకు అందించారు. అలాగే.. భారత్ పెట్రోల్ పంపు శ్రీ ఫిల్లింగ్ స్టేషన్ యాజమాని గందె శాంతి, మల్లికార్జున ఇంజనీరింగ్ వర్క్స్ యజమాని మోప్ప వెంకట్‌రెడ్డిలు.. చెరో రూ. 10వేలను ఆర్థిక సాయంగా అందించారు. నిరుపేద కుటుంబానికి అందరు ఆసరాగా నిలబడాలని వారు కోరారు.
ఇదీ చదవండి: లెక్కల మాస్టారుకు.. ఎనలేని సత్కారం!