యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. భువనగిరి-గజ్వేల్ రహదారిపై తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పోసి ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా... నిర్వాహకులు వడ్లు కొనట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం మొత్తం తడిసి మొలకలు వస్తున్నాయని వాపోయారు.
ధర్నా చేపట్టిన రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీర్ల ఐలయ్య మద్దతుగా నిలిచారు. తుర్కపల్లి, గంధమల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తిందని, వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని త్వరగా కొననాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: PRC: ఉద్యోగులకు గుడ్న్యూస్... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!