యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని సింగారం, బొందుగుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. తూకం వేసిన ధాన్యాన్ని మార్కెట్ నుంచి తరలించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాల వల్ల ధాన్యం తడిసి మొలకలు వస్తున్నా.. నిర్వాహకులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఈ విషయంపై స్పందించిన తహసీల్దార్.. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: Indrakaran reddy: రైతు వేదికను ప్రారంభించిన మంత్రి