యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక కాకాని శ్రీనివాస్ అనే యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ గ్రామంలో తనకున్న మూడు ఎకరాలతో పాటు, మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. పంట పెట్టుబడి కోసం అప్పులు చేసి సాగు చేసి నష్టపోయాడు.
అప్పుతీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవీ చూడండి: 'అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసిన ఉద్యోగులు'