యాదాద్రీశుడి ఆలయ విస్తరణ పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేసేందుకు ‘యాడా’ కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఆలయ శిల్పి ఆనందసాయి, స్తపతి వేలు శనివారం పనులను పరిశీలించి సంబంధిత గుత్తేదారులతో చర్చించారు. అనతి కాలంలోనే శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశయమని పేర్కొన్నారు. అందుకే ఆలయ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రధానాలయంతోపాటు అనుబంధ శివాలయం పనులను ఆలయ శిల్పి, స్తపతి నిశితంగా పరిశీలించి లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. స్వర్ణతాపడం పనులపైనా చర్చించారు. ఆలయ ముఖమండపంలో స్ఫటిక లింగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇవీచూడండి: దూలపల్లిలో కరోనా ఐసోలేషన్ సెంటర్..!