యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్ర నిర్వహించారు. దేశాన్ని ప్లాస్టిక్ రహిత భారత్‌గా మార్చాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు.
మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామసుందర్ రావు కోరారు. స్థానిక భాజపా నేతలు, కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆదిలాబాద్‌లో వైభవంగా పండరిపురం యాత్ర