యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో యాత్రికులు బస చేసేందుకు వసతుల కల్పనకు యాడ కృషిచేస్తోంది. కొండకింద గతంలో ఉన్న తులసి తోట ప్రాంగణంలో నిర్మించిన వసతి గదుల చెంతనే.. భక్తులు బస చేసేందుకు అనుగుణంగా 125 గదులతో కూడిన ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. రూ. 16 కోట్ల వ్యయంతో వీటిని నిర్మిస్తున్నట్లు యాడ అధికారులు తెలిపారు. దాతల విరాళాల ద్వారా ఈ వసతి గదుల ఏర్పాటు అవుతున్నాయని యాడా తెలిపింది.
కొండపైన ఆలయ సన్నిధిలో కాటేజీ గదులు అన్నింటిని తొలగించిన విషయం తెలిసిందే. ఆలయాలను విస్తరించి పునర్ నిర్మాణం చేపట్టడం వల్ల హరి, హరుల ఆలయాలే తప్ప ఎటువంటి వసతులు ఉండవని యాడ వెల్లడిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తజనానికి కొండకింద గల పెద్ద గుట్టపై కాటేజీలు నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు