ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన డాక్టర్ అక్కినేపల్లి రఘురాం రావు పేరును అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఆ యూనివర్సిటీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తలు, ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్, ఫార్మాసూటికల్ తదితర రంగనిపుణులపై 22 ప్రధాన అంశాలు, 176 విభాగాల ఆధారంగా సర్వే నిర్వహించింది.
కాగా ఆ సర్వేలో టాప్ 2 శాతం శాస్త్రవేత్తలను గుర్తించిందని డాక్టర్ అక్కినేపల్లి రఘురాం రావు వివరించారు. 1984లో ఆంధ్రాయూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన రఘురాం తర్వాత వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీలో పీహెచ్డీ పట్టా పొందారు. ప్రస్తుతం ఆ విశ్వవిద్యాలయంలోనే ఆచార్యునిగా పనిచేస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్ర మీడియా అకాడమీ కార్యదర్శిగా ముర్తుజా పదవీ బాధ్యతలు