యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మధురకవి కూరెళ్ల విఠలాచార్య తెలంగాణ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్కు చెందిన నటరాజ్ అకాడమీ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 28న రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఆరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా కూరెళ్ల పురస్కారం అందుకోనున్నారు. పల్లెటూరు వాసులకు పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉందని డాక్టర్. కూరెళ్ల విఠలాచార్య తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు మరో పన్నెండు గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తానని అన్నారు.
- ఇదీ చూడండి : 72 మంది బాలకార్మికులకు విముక్తి