కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసి వేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
ఎత్తేయడం తప్పు..
కేంద్రానికి వత్తాసు పలుకుతూ.. రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానన్న కేసీఆర్.. రైతు పండించిన పంటను ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు.
మోదీ దిష్టిబొమ్మ..
భాజపా, తెరాస సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కలెక్టరేట్లోకి కార్యకర్తలు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. వినతిపత్రం సమర్పించడానికి కొద్ది మందికే అనుమతించారు.
ఇదీ చూడండి: భాజపా, తెరాస మధ్య చీకటి ఒప్పందం: ఉత్తమ్