ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం డీహెచ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా కరోనా కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో కొవిడ్‌పై పూర్తిస్థాయిలో సమీక్ష జరిపామని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఈ క్రమంలోనే గత రెండేళ్లుగా యాదాద్రీశుడి దయతో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని డీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ వేవ్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్నా.. మరణాల శాతం ఉండబోదన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రూ.11 వందల కోట్లతో యాదాద్రి ఆలయాన్ని జగతి మెచ్చేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్దతో తీర్చిదిద్దారని కొనియాడారు.
కరోనా కొత్త వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పూర్తిస్థాయిలో సమీక్ష జరిపాం. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత రెండేళ్లుగా యాదాద్రీశుడి దయతో కొవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. - శ్రీనివాసరావు, ఆరోగ్య శాఖ డైరెక్టర్
మరోవైపు హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్‌రెడ్డి సైతం యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇవీ చూడండి..
ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గింది: డీహెచ్ శ్రీనివాస్
కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంటుంది: డా.నాగేశ్వర్‌రెడ్డి