తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. స్వామివారి నిత్యకల్యాణం, వ్రత పూజల్లో పాల్గొంటున్నారు. ఉదయం నుంచి వర్షం కురుస్తోన్న భక్తులు దర్శనానికి బారులుతీరి... స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
కల్యాణ కట్ట, ప్రసాదాల విక్రయశాల ప్రాంతాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది. స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట పడుతోంది. ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.
ఇదీ చదవండి: ఆ ఊళ్లో బోరుబావులు వెయ్యరు.. ఎందుకో తెలుసా?