యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురంలో జింకను వేటాడి తిన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం నీల రాములు పంట పొలంలో అడవి పందుల కోసం వలలు వేయగా జింక చిక్కుకుంది. జింక మాంసాన్ని నీల రాములు, నీల దశరథ, మన్నె నర్సింహా గ్రామంలోని 15 మందికి అమ్మారు. ఈ విషయాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి అటవీ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారి కొండాపురం చేరుకుని జింకను వలవేసి పట్టుకున్న ప్రదేశాన్ని పరిశీలించి ఉచ్చుకు వాడిన ఇనుప తీగలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని పెంట కుప్పల నుంచి ఎముకలు సేకరించి ఫోరెన్సీ ల్యాబ్‌కు పంపుతామన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణ గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్