యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో శాంత్రి భద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాల మైదానంలో 250 మంది పైగా వాహనదారులకు శిరస్త్రాణంపై అవగాహన కల్పించారు.
శిరస్త్రాణం ధరించని కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. నెలరోజులపాటు అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇవీచూడండి: గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి