బైక్‌ని డీసీఎం ఢీ కొనటం వల్ల ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కపూర్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. మృతుడు గౌస్‌నగర్‌కు చెందిన పాక శ్రీశైలంగా గుర్తించారు. భువనగిరి నుంచి గౌస్‌నగర్‌కు బైక్‌పై బయలుదేరిన పాక శ్రీశైలం తుక్కపూర్ వద్దకు చేరుకోగానే గ్లాస్ ఫ్యాక్టరీకి చెందిన డీసీఎం భువనగిరి వైపు వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
ఘటనతో పాక శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. బాధితుని తరపున గ్రామస్తులు, బంధువులు ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇవీ చూడండి : ఠారెత్తిస్తున్న ఎండలు... ఇంకా ఎన్ని రోజులో..!