యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల, గుండాల గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది తెలంగాణలో 36శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని ఆయన తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
అన్నదాతలు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం కల్పించే గిట్టుబాటు ధర పొందాలని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని.. ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. రైతులు ధాన్యంలో తేమ శాతం తగ్గించి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీటీసీ లక్ష్మి, ప్యాక్స్ ఛైర్మన్ లింగాల భిక్షం, వైస్ ఎంపీపీ మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్లు.. వాటి కోసం క్యూ లైన్లు