యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం రాచకొండ గుట్టలోని జలపాతంలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఎత్తైన కొండపై నుంచి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. 50 అడుగుల ఎత్తుపై నుంచి బండరాళ్లు పడి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా హయత్నగర్ వాసిగా గుర్తించారు.
ఇదీ చదవండిః రాజులేలిన రాచకొండలో దాగున్న జలపాతాలు