ETV Bharat / state

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. నరసింహ నామస్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు - Devotees in Yadadri

Devotees Crowd at Yadadri Temple : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవు రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి యాదాద్రీశుడిని దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ లక్ష్మీ నరసింహ నామస్మరణతో ప్రతిధ్వనిస్తున్నాయి.

Yadadri Sri Lakshmi Narasimha swami Temple

author img

By

Published : Jan 8, 2023, 3:08 PM IST

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

Devotees Crowd at Yadadri Temple : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి కార్లు, బస్సులు ప్రత్యేక వాహనాలలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోందని భక్తులు తెలిపారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడుతున్నాయి.

లక్ష్మీనరసింహ నామస్మరణతో యాదగిరి గుట్ట ప్రతిధ్వనిస్తోంది. ప్రసాదం కౌంటర్లు, నిత్య కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల సందడి నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో రద్ధీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

యాదాద్రిలో 'యాదరుషి నిలయం' చూశారా? : నాడు ముళ్లకంపలు.. బండరాళ్లు.. చెత్తతో చిందరవందరగా, ఎత్తుపల్లాలుగా ఉన్న పెద్దగుట్ట అది. యాదాద్రిలోని ఆ ప్రాంతమంతా నేడు ఆలయ నగరిగా రూపుదిద్దుకుంటోంది. అక్కడే విశాల రహదారులు, ఆహ్లాదకర పచ్చదనంతో ఆకట్టుకునేలా సరికొత్త కుటీరం సిద్ధమైంది. యాదాద్రి క్షేత్రం ఆవిర్భావానికి మూలమైన యాదవ మహర్షి పేరిట ‘యాదరుషి నిలయం’ నిర్మించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సీఎం కేసీఆర్‌ సంకల్పంతో క్షేత్రాభివృద్ధికి పాటుపడుతున్న వైటీడీఏ రూ.3 కోట్లతో దీన్ని తీర్చిదిద్దింది.

5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ కుటీరం మధ్యన సమావేశ మందిరం, కిచెన్‌, డైనింగ్‌హాల్‌, నాలుగు సూట్లు ఉంటాయి. పరిసరాల్లో యాదవ మహర్షి శిలా విగ్రహాన్ని సిద్ధం చేశారు. అక్కడి నుంచి యాదాద్రీశుల ఆలయం, యాదగిరిగుట్ట పట్టణం, పాతగుట్ట, భువనగిరి ఖిల్లాను తిలకించవచ్చు. ఈ కుటీరాన్ని వైటీడీఏ క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తామని ఆ సంస్థ వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు.

భక్తులతో కిటకిటలాడుతున్న ప్రధాన ఆలయాలు: రాష్ట్రంలో ప్రధాన ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ ఏకదశి పురష్కరించుకొని దక్షిణాది ఆయోధ్యగా పేరొందిన భద్రాద్రి రామయ్య సన్నిధిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. సెలవు రోజు కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో కదలిరావడంతో ఆలయ పరిసరాలన్నీరద్దీగా మారాయి.

ఆలయ అర్చకులు లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పుష్పాలతో అర్చన చేశారు. శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలలో ఏడో రోజైన నేడు.. భద్రాచలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వేడుక నిర్వహించనున్నట్లు అర్చకులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.