యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. యాదగిరిగుట్ట, ఆలేరు, బొమ్మలరామారంలో మోస్తరు వర్షం కురవగా యాదగిరిగుట్ట మండలంలో పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానకు వందల ఎకరాల్లో వరిపంట పూర్తిగా దెబ్బతింది.
భువనగిరి నియోజకవర్గంలో వర్షానికి ధాన్యం గింజలు నేలరాలాయి. చేతికందిన పంట పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మేర కోసిన పంటను కొందరు రైతులు ఐకేపీ సెంటర్లకు తరలించారు. సాయంత్రం పూట కురిసిన వాన వల్ల చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయగా స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తగ్గుతున్న వాయుకాలుష్యం.. తేటపడుతున్న నగరాలు