యాదాద్రి భువనగరిలో జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో యాదరిగిగుట్టలో ర్యాలీ నిర్వహించారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నినాదాలు చేశారు. సర్కారు నుంచి సరైన స్పందన రాకుంటే సమ్మె ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: ఇవాళ్టి నుంచి షెడ్యూలు ప్రకారం బస్సులు